నలుగురు దోపిడీ దొంగల అరెస్ట్‌

Thieves are arrested In Barampuram - Sakshi

బరంపురం ఒరిస్సా : వేర్వేరు దోపిడీ కేసుల్లో నిందితులుగా ఉన్న నలుగురు దొంగలను పట్టణ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక ల్యాప్‌ట్యాప్, 3 మొబైల్స్, 6 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు ఐఐసీ అధికారి నిహర్‌కాంత్‌ మహంతి తెలిపారు. నగరంలోని పెద్దబజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పలు దోపిడీలకు పాల్పడిన ఒక దొంగను అరెస్ట్‌ చేశామని, అనంతరం నిందితుని నుంచి సుమారు 6 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఐఐసీ అధికారి సురేష్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top