బీజేపీకి ‘టాటా’ విరాళం రూ.356 కోట్లు

Tata donation to BJP is Rs 356 crore - Sakshi

న్యూఢిల్లీ: బీజేపీకి 2018–19 ఏడాదికి టాటాకు చెందిన ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ నుంచి రూ.356 కోట్ల విరాళాలు లభించాయి. ఈమేరకు బీజేపీ తాజాగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన పత్రాల్లో వెల్లడించింది. దీని ప్రకారం పార్టీ, 2018–19 ఏడాదికి రూ.700 కోట్ల విరాళాలను చెక్కులు, ఆన్‌లైన్‌ పేమెంట్ల ద్వారా స్వీకరించినట్లు తెలిపింది. ఇందులో దాదాపు సగం విరాళాలు టాటాకు చెందిన ప్రోగ్రెసివ్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌కు చెందినవే. ప్రోగ్రెసివ్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ రూ.356 కోట్ల విరాళాలివ్వగా, ప్రుడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ రూ.54.25 కోట్లు ఇచ్చినట్లు బీజేపీ వెల్లడించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top