‘సదావర్తి’పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Supreme Court Sensational Comments on Sadavarti Lands - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సదావర్తి సత్రం భూములపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భూములను చౌకగా విక్రయిస్తే చూస్తూ ఊరుకోమలేమని తేల్చి చెప్పింది. తాజాగా జరిగిన బహిరంగ వేలంలో సదావర్తి భూములు మూడు రెట్లు అధికంగా ధర పలకడంపై ఉన్నత న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రూ.40 కోట్లు అధికంగా ధర రావడం చిన్న విషయం కాదని వ్యాఖ్యానించింది.

రెండోసారి జరిగిన వేలంలో రూ.60.30కోట్లు పలికిన బిల్డర్‌ డబ్బులు చెల్లించలేకపోయారని, రెండో బిల్డర్‌కు అవకాశం ఇచ్చామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. అలాగే రెండో బిల్డర్‌ డబ్బులు చెల్లించేందుకు ఇచ్చిన గడువు రేపటితో (శనివారం) ముగుస్తుందని న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లారు. కేసు తదుపరి విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా పడింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top