నాలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court issues notice to UP, Punjab, Haryana and Delhi governments  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని సహా ఉత్తరాదిలో ఆందోళనకరంగా పెరుగుతున్న కాలుష్యంపై సుప్రీం కోర్టు సోమవారం ఢిల్లీ, యూపీ, పంజాబ్‌, హర్యానా ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిం‍ది. ఆయా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొందని, సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సర్వోన్నత న్యాయస్ధానం పేర్కొంది. ఉత్తరాదిలో ఇటీవల కాలుష్యం​ప్రమాదకరస్ధాయిలకు పెరిగిందని,ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలితాలు ఇవ్వడంలేదని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

కాలుష్య సమస్యను అధిగమించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరమని కోర్టు అభిప్రాయపడింది. పారిశ్రామిక సంస్థలు ఫర్నేస్‌ ఆయిల్‌ వాడకంపై తమ నిషేధం కేవలం దేశ రాజధాని ప్రాంతానికే పరిమితం కాదని, రాజస్థాన్‌, యూపీ, హర్యానాలకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకరంగా పెరిగి ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది. 

Back to Top