మాల్యా అరెస్టుపై జోకులు పేలాయ్‌

social media reaction on vijay mallya - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : విజయ్‌ మాల్యా అరెస్టు అయ్యారనే విషయం తెలియగానే ఆత్రంగా తమ స్మార్ట్‌ఫోన్‌లు, ముందున్న డెస్క్‌టాప్‌లు ఓపెన్‌ చేసి వివిధ వార్తల వెబ్‌సైట్‌లలోకి తొంగి చూశారు. అలా చూసిన వారంతా అవాక్కయ్యారు. ఎందుకంటే అందులో మాల్యాకు బెయిల్‌ అనే వార్త దర్శనం ఇచ్చింది. అరే ఇప్పుడే అరెస్టు అప్పుడే బెయిలా అని నోరెళ్లబెట్టడం వారి పనైంది. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు దాదాపు నెటిజన్లంతా ఇలా మాల్యా అరెస్టుపై షాకవ్వాల్సి వచ్చింది. దీంతో మరోసారి వారి అదే సోషల్‌ మీడియాలో ఎడా పెడా జోకులు పేల్చేశారు. సెటైర్ల మీద సెటైర్లు వేస్తూ పండుగ చేసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాల్యా వార్తను పెద్ద హాస్యంగా చిత్రించారు.

మాల్యా అరెస్టు అయిందని తెలిసినప్పుడు తాను చిన్న పనిలో ఉన్నానని అది ముగించుకొని చూసే వరకు బెయిలొచ్చిందని తెలిసిందని ఒకరు, మాల్యా మళ్లీ అరెస్టయ్యారని ఇంకొకరు పోస్ట్‌ చేశారు. అది చూసిన వారంతా ఆ పోస్ట్‌ను తిరిగి పోస్ట్‌ చేసే లోపు మాల్యాకు బెయిల్ రాకుండా ఉంటే బాగుంటుందని ఇంకొకరు ట్వీట్‌ చేశారు. ఇక మాల్యాకు మహిళలంటే యమ క్రేజ్‌ అని, గౌరవం అని, భారత్‌లో అరెస్టయిన హనీప్రీత్ విషయంపై నుంచి దృష్టిని పక్కదారి పట్టించేందుకే ఆయన అలా అరెస్టయి ఇలా విడుదలయ్యారని మరొకరు ట్వీట్ చేశారు. ఇక ఇంకొకరయితే.. బెయిల్ పొందే ఆటను ఒలింపిక్స్‌లో పెడితే మాత్రం ప్రతిసారి మాల్యాకే గోల్డ్ మెడల్ వస్తుందని పేర్కొన్నాడు. మాల్యా అరెస్ట్ కావడం ఇది రెండోసారి కాగా, ఆయనకు రెండోసారి కూడా క్షణాల్లోనే బెయిలొచ్చిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top