‘ప్రత్యేక హోదాపై ఆయనే చెప్పాలి’

‘ప్రత్యేక హోదాపై ఆయనే చెప్పాలి’


న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వడం లేదో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడే చెప్పాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇవ్వమని తాము అడిగితే వెంకయ్య పదేళ్లు కావాలని అడిగిన విషయాన్ని ఏచూరి గుర్తు చేశారు.అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అసెంబ్లీ సీట్ల పెంపు మీద ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లు లేదని తెలిపారున ఇప్పటికే రాజ్యసభలో 10, లోక్‌సభలో 8 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. రైతులకు మద్దతు ధర దొరికితే ఆత్మహత్యలు ఆగుతాయని అభిప్రాయపడ్డారు.జీఎస్టీ అమలు, ఇబ్బందులపై పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చించాలని నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనపై కొన్ని  అంశాలు చర్చించాల్సివుందని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత నియోజకవర్గాల పెంపుపై చర్చిస్తామని చెప్పారు.

Back to Top