బొయిపరిగుడలో కమ్యూనిస్టుల ర్యాలీ

Rally Of Communists In Bohipari guda - Sakshi

జయపురం: గత ఎన్నికలలో æప్రజలకు అనేక హామీæలు  ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికార పీఠమెక్కిన తరువాత ఆ హామీలను తుంగలో తొక్కారని భారతీయ కమ్యూనిస్టు పార్టీ నేతలు ధ్వజమెత్తారు. శాసనోల్లంఘన ఆందోళన కార్యక్రమంలో భాగంగా కమ్యూనిస్టు పార్టీ బొయిపరిగుడలో శుక్రవారం భారీర్యాలీ నిర్వహించింది.

ఈ ఆందోళనలో భాగంగా సమితిలో గల పలు ప్రాంతాల ప్రజలు ర్యాలీగా బొయిపరిగుడకు చేరుకున్నారు. కమ్యూనిస్టుల ర్యాలీతో బొయిపరిగుడ వీధులు అరుణారుణమై కనిపించాయి. బొయిపరిగుడలోని డాక్‌ బంగ్లాకు చేరుకున్న కమ్యూనిస్టు కార్యకర్తలు, ప్రజలు ఎర్ర జెండాలు చేతబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీలను దుయ్య బడుతూ నినాదాలు చేశారు.

అనంతరం వారు సమితి కార్యాలయానికి చేరుకుని అక్కడ కార్యాలయం గేట్‌కు తాళాలు  వేసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల వైఫల్యంపై విరుచుకు పడ్డారు. గత ఎన్నికల ముందు మోడీ అనేక వాగ్దానాలు చేశారని వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు.

ఆయన పాలనలో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని ఆరోపించారు. విదేశాల నుంచి నల్లధనం రప్పిప్తానని చెప్పిన మోడీ మాటలకే పరిమితమయ్యారని ప్రతి ఏడాదీ రూ.2 కోట్ల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామన్న ఆయన ఏ ఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదని దుయ్యబట్టారు. ధరలు తగ్గిస్తామని ప్రగల్బాలు పలికి ధరలు గత నాలుగేళ్లలో రెండితలు పెంచారని ఆరోపించారు.  

గతంలో దేశంలోని నిరుపేదలు 10 కోట్ల మంది  రోజుకు 8 రూపాయలతో జీవించే వారని, అయితే నేడు వారి సంఖ్య  14 కోట్లకు పెరిగిందని దుయ్యబట్టారు. నేడు దారిద్య్ర రేఖ కింద దేశ జనాభాలో 30 శాతం మంది ప్రజలు మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

చుక్కలనంటిన నిత్యావసరాల ధరలు

నాలుగేళ్ల మోడీ పాలనలో నిత్యావసరవస్తువుల ధరలు రెండితలు పెరిగాయి. చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో 3 రెట్లు తగ్గగా మన దేశంలో కేంద్ర ప్రభత్వం తైల వ్యాపారుల స్వార్థం కోసం  ప్రతి రోజూ పెంచుతున్నారని ధ్వజమెత్తారు. మోడీ ప్రభుత్వం నిరుపేదలు, సామాన్య  ప్రజలు, రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి పెట్టుబడుదారులు, పారిశ్రామికుల ప్రయోజనా లకు దాసోహమంటోందని ఎద్దేవా చేశారు.

పరిశ్రమల అధిపతులు, పెద్ద వ్యాపారులకు కోట్లాది రూపాయల రుణాలు మాఫీ చేస్తున్న మోడీ ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేయక పోవటం ఆ ప్రభుత్వ విధానాలకు అద్దం పడుతోందని దుయ్యబట్టారు. పై ఆరోపణలతో క మ్యూనిస్టు నేతలు రాష్ట్ర పతికి  ఉద్దేశించిన ఒక వినతిపత్రాన్ని బొయిపరిగుడ బీడీఓకు సమర్పించారు. 

వృద్ధ రైతులకు పెన్షన్‌ అందజేయాలి

ఈ సందర్భంగా పార్టీ నేతలు  రాజ్యాంగాన్ని పరిరక్షించి దేశాన్ని కాపాడాలని, నిత్యావసరాల ధరలు తగ్గించాలని, దళితులు, ఆదివాసీలు, అల్పసంఖ్యాకవర్గ ప్రజలు, మహిళలకు రక్షణ కల్పించాలని వినతిపత్రంలో కోరారు.

మహానదిపై ఛత్తీస్‌గఢ్‌  ప్రభుత్వం నిర్మిస్తున్న అన్ని డ్యామ్‌లు నిలిపివేయాలని, అన్ని రకాల రైతుల  రుణాలు మాఫీ చేయాలని,  60 ఏళ్ల వయసు రైతులకు రూ.3వేల పెన్షన్‌ చెల్లించాలని, కనీస దైనిక కూలీ రూ.350 లేదా నెలకు రూ.10వేల  జీతం సమకూర్చాలని, ప్రజలకు ఆహార భద్రత కల్పిం చాలని, ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరా అవా స్‌ 0యోజనలో సమకూర్చాలని కోరారు.

2018 భూఅధికార చట్టాన్ని  జాతి, కుల మత,భాష షరతులు లేకుండా అందరికీ అమలు చేయాలని కొమొరొ, దురువ గిరిజన తెగలను  ఆది వాసీలుగా పరిగణించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సీపీఐ కార్యవర్గ సభ్యుడు, కా ర్మిక నేత ప్రమోద్‌ కుమార్‌ మహంతి, గిరిజన నేత హొలధొర పూజారి తదితరులు ప్రసంగించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top