ప్రాణం తీసిన టిక్‌టాక్‌ చాలెంజ్‌

In Rajasthan 12 Years Boy Hangs Himself Wearing Mangalsutra And Bangles - Sakshi

జైపూర్‌ : టిక్‌టాక్‌ చాలెంజ్‌ ఓ బాలుడి ప్రాణం తీసింది. 12 ఏళ్ల బాలుడు టిక్‌టాక్‌ చాలెంజ్‌లో భాగంగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. రాజస్తాన్‌ కోటాకు చెందిన ఓ బాలుడు టిక్‌టాక్‌ యాప్‌కు బానిసగా మారాడు. ఈ క్రమంలో ఓ టిక్‌టాక్‌ చాలెంజ్‌లో పాల్గొన్నాడు. దాని నిభందనల ప్రకారం మంగళసూత్రం, చేతికి గాజులు ధరించాడు. అనంతరం బాత్రూమ్‌లోకెళ్లి మందపాటి చైన్‌తో మెడకు ఉరి బిగించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం రాత్రి పూట జరిగింది. దాంతో కుటుంబ సభ్యులకు వెంటనే తెలియలేదు.

పొద్దున లేచిన దగ్గర నుంచి కుమారుడు కనపడకపోవడంతో.. ఇళ్లంతా వెతికారు. చివరకూ బాత్రూమ్‌లో ఉరి వేసుకుని చనిపోయిన బాలుని మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ సందర్భంగా బాలుని తండ్రి మాట్లాడుతూ.. ‘రాత్రంతా నా కుమారుడు టిక్‌టాక్‌లోనే మునిగి పోయి ఉండేవాడు. వద్దని వారిస్తే.. మాతో గొడవ పడేవాడు. దానికి బానిస అయ్యాడు. టిక్‌టాక్‌ చాలెంజ్‌లో భాగంగానే నా కుమారుడు ఇలా చనిపోయాడు’ అని తెలిపారు. ‘టిక్‌టాక్‌ యాప్‌ లేకపోతే నా కుమారుడు బతికేవాడు’ అంటూ విలపించాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top