పెళ్లిపై స్పందించిన రాహుల్‌

Rahul Gandhi Asked Who Should Be Heroine In His Biopic - Sakshi

పూణే : వెండితెరపై రాజకీయ నేతల బయోపిక్‌లు సందడి చేస్తున్న క్రమంలో తన బయోపిక్‌లో హీరోయిన్‌ ఎవరంటూ విద్యార్ధులు అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పనినే ప్రేమిస్తానని, పెళ్లి కూడా దాంతోనేనని నవ్వుతూ బదులిచ్చారు. మహారాష్ట్రలోని పూణేలో శుక్రవారం ఆయన విద్యార్ధులతో ముచ్చటిస్తుండగా రాహుల్‌కు వారి నుంచి ఈ ప్రశ్న ఎదురైంది.

కాగా,రాహుల్‌కు పెళ్లి గురించి పలుమార్లు ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. గతంలో తనను పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటిస్తున్న సందర్భంగా అడిగిన ప్రశ్నకు తాను కాంగ్రెస్‌ పార్టీని పెళ్లాడానని ఆయన చెప్పుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌ విద్యార్దులతో సమావేశం కాగా ఈ భేటీకి ప్రముఖ జాకీ మలిష్క సమన్వయకర్తగా వ్యవహరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top