లాక్‌డౌన్‌ ప్రకటించిన పంజాబ్‌

Punjab Orders Lockdown Till March End - Sakshi

చండీగఢ్‌ : భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 324కు చేరి మృతుల సంఖ్య 6కు పెరగడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు చర్యలు ముమ్మరం చేశాయి. దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతుండగా ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు డెడ్లీ వైరస్‌ను నిరోధించేందుకు పంజాబ్‌ ప్రభుత్వం మార్చి 31 వరకూ లాక్‌డౌన్‌ ప్రకటించింది.

లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసర సేవలు పొందేందుకు ప్రతి కుటుంబం నుంచి ఒక్కరినే బయటికి వచ్చేందుకు అనుమతిస్తారు. నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాలు మినహా అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జలంధర్‌, పటియాలా, నవన్‌షహర్‌, హోషియార్పూర్‌, సంగ్రూర్‌ జిల్లాల్లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి బుధవారం అర్ధరాత్రి వరకూ లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు.

చదవండి : కరోనా: ఓరి నాయనో.. ఇక పెళ్లి అవ్వదా!?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top