పుల్వామా నుంచి బాలాకోట్‌ 

The Pulwama terrorist attack caused fresh tensions - Sakshi

భారత్‌–పాకిస్తాన్‌ల మధ్య చోటుచేసుకున్న తాజా ఉద్రిక్తతకు పుల్వామా ఉగ్ర దాడి కారణమైంది. ఈ దాడికి ప్రతీకారంగా భారత్‌ గత కొన్ని రోజులుగా చేపట్టిన చర్యల పరిణామక్రమం ఇదీ... 

►ఫిబ్రవరి 14
300 కిలోల పేలుడు పదార్థాలతో నింపిన వాహనంతో జైషే ఆత్మాహుతి దళ సభ్యుడు సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌ను ఢీకొట్టాడు. ఈ దాడిలో 40 మంది జవాన్లు మరణించగా 70 మంది గాయపడ్డారు. 

►ఫిబ్రవరి15
ఈ దాడి చేసింది తామేనని జైషే ప్రకటించడమేగాక ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో 20 ఏళ్ల ఆత్మాహుతి దళ సభ్యుడు ఆదిల్‌ అహ్మద్‌ దర్‌ సైనిక దుస్తుల్లో కనిపించాడు. సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడి ద్వారా తాను స్వర్గానికి పోతానని చెప్పుకున్నాడు.  

►ఫిబ్రవరి16
పుల్వామా ఉగ్ర దాడికి దీటుగా బదులివ్వాలన్న ఒత్తిళ్ల మధ్య పాక్‌పై దౌత్యపరమైన ఒత్తిడి తేవడం, సైనిక దాడులు జరపడం వంటి ప్రత్యామ్నాయాలపై చర్చించింది. ఈ దాడి తర్వాత పాకిస్తాన్‌తో వాణిజ్యానికి సంబంధించిన ప్రత్యేక హోదాను ఉపసంహరించుకుంది. పాక్‌ నుంచి దిగుమతి చేసుకునే అన్ని సరుకులపై సుంకాన్ని 200 శాతానికి పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. 

►ఫిబ్రవరి20
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ రాజధాని ముజఫరాబాద్‌కు బస్సు సర్వీసును భారత్‌ నిలిపివేసింది.  

►ఫిబ్రవరి22
సింధూ నదీ జలాల ఒప్పందం ప్రకారం తమ వాటా నీటిని పాక్‌కు విడుదల చేయబోమని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. 

►ఫిబ్రవరి23
కశ్మీర్‌ లోయలో విస్తృత దాడులు ప్రారంభించిన ప్రభుత్వం అనేక మంది వేర్పాటువాద నేతలను అరెస్ట్‌ చేసింది. 

►ఫిబ్రవరి24
కుల్గామ్‌ జిల్లాలో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాదితోపాటు పోలీసు డీఎస్పీ మరణించారు. 

►ఫిబ్రవరి25
 పుల్వామా దాడికి ఉపయోగించిన వాహనంతోపాటు (మారుతీ ఈకో), జైషే సభ్యుడైన వాహన యజమానిని సజ్జద్‌ భట్‌గా ఎన్‌ఐఏ గుర్తించింది. 

►ఫిబ్రవరి26
మంగళవారం తెల్లవారుజామున 3.30కి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌ సెక్టర్‌లోని జైషే ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేనకు చెందిన 12 మిరాజ్‌ యుద్ధ విమానాలు వెయ్యి కిలోల బాంబులతో విరుచుకుపడ్డాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top