అత్యంత ప్రమాదకర దేశాల్లో 8వ స్థానంలో పాక్


వాషింగ్టన్: వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థ రూపొందించిన అత్యంత ప్రమాదకర దేశాల జాబితాలో పాకిస్తాన్ 8వ స్థానంలో నిలిచింది. దీంతో పాటు దక్షిణాసియా నుంచి మరో దేశం అఫ్ఘానిస్థాన్ 4వ స్థానంలో ఉంది. ఇంటెల్‌సెంటర్ అనే కంపెనీ ‘కంట్రీ త్రెట్ ఇండెక్స్’ పేరిట మంగళవారం ఈ జాబితాను వెలువరించింది.



ఉగ్రవాదం, తిరుగుబాటు లాంటి పలు ఘటనల కారణంగా పాక్‌లో గడిచిన 30 రోజుల్లో చాలా మంది మృతిచెందినట్లు సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో ఇరాక్ మొదటి స్థానంలో ఉండగా, నైజీరియా(2), సోమాలియా(3), యెమెన్(5), సిరియా(6), లిబియా(7), ఈజిప్టు(9), కెన్యా(10) స్థానాల్లో ఉన్నాయి.

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top