పాక్‌ సైన్యం కాల్పుల్లో ఇద్దరు మృతి

pakistan firing  in jammu and kashmir's poonch

జమ్మూకాశ్మీర్‌: పదే పదే పాక్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. పౌరులే లక్ష్యంగా పాక్‌ బలగాలు కాల్పులకు తెగబడుతున్నాయి. పూంచ్‌ సెక్టార్‌లోని కేరి, దిగ్వార​ ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున పాక్‌ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు మరణించారు. అందులో ఓ బాలిక ఉంది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్‌ రేంజర్లు మోటార్లు, తుపాకులతో కాల్పులకు పాల్పడుతున్నారు.

ఈ కాల్పుల్లో పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులు మృతిచెందగా.. మరో నలుగురు పౌరులు గాయాలపాలయ్యారు. పాక్‌ కాల్పులకు భారత సైన్యం ధీటుగా జవాబిస్తోందని ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం పూంచ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిహద్దు వెంట ఉన్న గ్రామాల ప్రజలను సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. 

Back to Top