ఎమ్మెల్యే రషీద్‌ ఇంజనీర్‌కు ఎన్‌ఐఎ సమన్లు

NIA summons to Engineer Rashid - Sakshi

అక్టోబర్‌3న విచారణకు రావాలన్న ఎన్‌ఐఏ

వేర్పాటువాద ఆర్థిక మూలాలపై ఎన్‌ఐఏ దృష్టి

సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారనే కేసుకు సంబంధించి అక్టోబర్‌ 3న విచారణకు హాజరు కావాలని.. జమ్మూ కశ్మీర్‌ స్వతంత్ర ఎమ్మెల్యే రషీద్ ఇంజినీర్‌కు నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) సమన్లు జారీ చేసింది. లోయలో ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం అందిస్తున్న కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ విచారణ చేస్తోంది. అందులో భాగంగా పలువురిని ఎన్‌ఐఏ విచారణ చేస్తోంది. అందులో భాగంగా ఎన్‌ఐఏ రషీద్‌ ఇంజినీర్‌ను విచారణకు రావాలని ఎన్‌ఐఏ సమన్లు జారీ చేసింది.

ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం అందించిన కేసులో వ్యాపారవేత్త జహూర్‌ వాటాలినిఘెన్‌ఐఏ విచారణ చేస్తున్న సమయంలో తొలిసారి రషీద్‌ ఇంజినీర్‌ పేరు వెలుగులోకి వచ్చింది. వేర్పాటువాదులకు, పాకిస్తాన్‌ ప్రేరిపిత తీవ్రవాదులుకు లోయలో రషీద్‌ ఆర్థికంగా సహకారం అందిస్తున్నారని బయటకు వచ్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top