మోదీకి రష్యా అత్యున్నత అవార్డు

Narendra Modi To Be Honoured With Russia's Highest Civilian Award - Sakshi

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీని రష్యా ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది. ‘ ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్య్రూ ది అపోస్టల్‌’ అనే రష్యా అత్యున్నత పౌర అవార్డుతో మోదీని గౌరవించనున్నట్లు శుక్రవారం తెలిపింది.  మోదీకి ఈ అవార్డును ప్రకటించేందుకు శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆదేశాలు జారీ చేస్తూ సంతకం చేశారు.

మోదీకి అంతర్జాతీయ అవార్డు రావడం ఈ నెలలో ఇది రెండోసారి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం కూడా తమ దేశ అత్యున్నత పౌర అవార్డు ‘ జయేద్‌ మెడల్‌’ను మోదీకి ఇచ్చిన సంగతి తెల్సిందే. ఇరు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలను బలపరచడానికి మోదీ చేసిన ప్రయత్నాలకు గుర్తింపుగా ఆ దేశం ఈ అవార్డును ప్రకటించింది. ఎన్నికల వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఒక దేశ అత్యుత్తమ పౌర అవార్డు లభించడం బీజేపీ శ్రేణుకులకు బూస్ట్‌ ఇచ్చేనట్లే ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top