పీవీ సింధూకు ప్రశంసల వెల్లువ

Modi Congratulates PV Sindhu For Winning BWF World Championships - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ విజేత పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో అద్వితీయ ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆమెకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ గవర్నర్‌ హరిచందన్‌, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి,  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, బీజేపీ, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులతో పాటు క్రీడాకారులు, బాలీవుడ్‌, టాలీవుడ్‌ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.పీవీ సింధును చూసి భారత్‌ మరోసారి గర్విస్తోందంటూ ప్రధాని ట్వీట్‌ చేశారు. 

సింధూను చూసి గర్విస్తున్నాం.
మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ...పీవీ సింధు విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చారిత్రాత్మక విజయం సాధించిన ఆమెకు అభినందనలు తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి మొదటి భారతీయ క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించారన్నారు. ఆట మొదటి నుంచి చివరివరకూ అద్భుత ప‍్రతిభ ప్రదర్శించారని, ఆమె మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని సీఎం జగన్‌ ఆకాంక్షిస్తూ ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top