ఖైదీ కడుపులో నుంచి ఫోన్‌ రింగ్‌..

Mobile Phone Ring in Prisoner Stomach In Tihar Jail - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తీహార్ జైలులో విచారణలో ఉన్న ఒక ఖైదీని కోర్టులో ప్రవేశపెట్టిన తరువాత తిరిగి జైలుకు తీసువచ్చారు. ఆ ఖైదీని తనిఖీ చేస్తుండగా  అతని కడుపులో నుంచి ఫోన్ రింగ్ వినిపించింది. తొలుత అది ఎక్కడి నుంచి వస్తున్నదనేది అధికారులు గుర్తించలేకపోయారు. అయితే ఖైదీ దగ్గరి నుంచి వస్తోందని మాత్రం గ్రహించారు. మరింతగా పరిశీలించేసరికి ఆ ఖైదీ కడుపులో నుంచి ఈ శబ్ధం వస్తున్నదని పసిగట్టారు.

దీంతో ఆ ఖైదీని వారు ప్రశ్నించగా తాను అతిచిన్న ఫోనును, ఛార్జర్ లీడ్‌ను మిగేశానని తెలిపాడు. దీంతో జైలు అధికారులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. తరువాత పోలీసులు ఆ ఖైదీ కడుపులో నుంచి ఫోనును బయటకు తీసుకురాగలిగినా, ఛార్జర్ మాత్రం రాలేదు. ఇప్పటికీ అది అతని కడుపులోనే ఉండిపోయింది. ఈ ఘటన తీహార్ జైలు జరిగింది. కాగా ఈ ఖైదీ గతంలోనూ జైలు లోనికి ఫోను తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తూ పట్టబడ్డాడని అధికారులు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top