తల్లిబాంబుకి తాత మన దగ్గరుంది!

తల్లిబాంబుకి తాత మన దగ్గరుంది!


రేడియేషన్‌ విడుదల చేయని అతి శక్తిమంతమైన మాసివ్‌ ఆర్డినెన్స్‌ ఎయిర్‌ బ్లాస్ట్‌ బాంబ్‌(ఎంఓఏబీ) ఆప్ఘనిస్తాన్‌లోని ఐసిస్‌ స్ధావరంపై ప్రయోగించినట్లు అమెరికా పేర్కొంది. ఈ బాంబుకు మరో పేరు మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌. అమెరికా బాంబు దాడిలో దాదాపు 100 మంది తీవ్రవాదులు హతం కావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.


దీంతో వార్తల్లోకి ఎంటరై తమ వద్ద ఫాదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌ ఉందంటూ రష్యా పేర్కొంది. అయితే, అసలు రేడియేషన్‌ కలిగించని శక్తిమంతమైన బాంబు ఎవరి దగ్గర ఉంది?. మన దగ్గర. అవును భారత్‌ వద్ద రేడియేషన్‌ కలిగించని శక్తిమంతమైన బాంబు ఉంది. దీనిని మన డీఆర్‌డీవో ఆరేళ్ల క్రితమే అభివృద్ధి చేసింది. దాని పేరు సీఎల్‌-20. సంప్రదాయ పేలుడు పదార్ధాల కంటే 15 రెట్లు ఇది శక్తిమంతమైనది. అయితే, దీనిని ఎలా ప్రయోగిస్తారు అనే విషయం మాత్రం సీక్రెట్‌.ఇండియా వద్ద గల మరో బాంబు పేరు స్మార్ట్‌ ప్రిసైజ్‌ ఇంపాక్ట్ అండ్‌ కాస్ట్‌ ఎఫెక్టీవ్‌(ఎస్‌పీఐసీఈ). సింపుల్‌గా స్పైస్‌. దీనిని కార్గో విమానాల నుంచి ప్రయోగించాల్సిన అవసరం లేదు. ఇండియా వద్ద గల మిరేజ్‌ 2000, సుఖోయ్‌ జెట్ల నుంచి సులువుగా మోసుకెళ్లొచ్చన్నమాట. ఉగ్ర స్ధావరాల నేల మట్టం చేయాలనుకున్న సమయంలో దీన్ని భారత్‌ ఉపయోగించుకునే అవకాశం ఉంది. స్పైస్‌ను అభివృద్ధి చేసింది ఇజ్రాయెల్‌కు చెందిన రాఫెల్‌ అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. స్పైస్‌ బరువు కేవలం 1000 కేజీలు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ లాంటి వాటిని ఎయిర్‌ఫోర్స్‌ ద్వారా నిర్వహించాలనుకుంటే మొదటి చాయిస్‌ స్పైసే.

Back to Top