గొప్ప స్నేహితుడిని కోల్పోయా: ప్రధాని మోదీ

Missed Good Friend PM Modi On Arun Jaitley Dead - Sakshi

విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

కుటుంబ సభ్యుడిని కోల్పోయా: అమిత్‌ షా

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్‌​ నేత, కేంద్రమాజీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మృతిపట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఓ గొప్ప స్నేహితుడిని కోల్పోయానని విచారం వ్యక్తం చేశారు. ‘‘జైట్లీ ఇకలేరనే వార్త నన్ను ఎంతో బాధకు గురిచేసింది. గొప్ప వ్యక్తుల్లో జైట్లీ ఒకరు. ఎంతో కాలంగా ఇద్దరం కలిసి ప్రజాసేవలో ఉన్నాం. జైట్లీ రాజకీయ జీవితంలో ఎన్నో అత్యన్నత పదవులను సమర్థవంతంగా నిర్వర్తించారు. సమస్యను వెంటనే అర్థం చేసుకుని పరిష్కరించగల సమర్థవంతమైన వ్యక్తి జైట్లీ. అత్యయిక స్థితిలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు పాటిపడిన వ్యక్తి. దేశానికి, పార్టీకి ఆయన చేసిన సేవ ఎనలేదని. జైట్లీ గొప్ప రాజకీయ దిగ్గజం. వర్ణించలేని మేథోసంపత్తి ఆయన సొంతం. దేశ చరిత్ర, న్యాయశాస్త్రం, పరిపాలన, ప్రజా విధానం వంటి అంశాలపై ఆయనకున్న పట్టు వర్ణించలేదని. సమర్థవంతమైన నేతను కోల్పోయాం. జైట్లీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ట్విటర్‌లో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

కుటుంబ సభ్యుడిని కోల్పోయా: అమిత్‌ షా
అరుణ్‌జైట్లీ మృతిపట్ల కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్‌ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సొంత కుటుంబ సభ్యుడిని కోల్పోయానని దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రాజకీయాల్లో జైట్లీనే తనకు మార్గదర్శి అని గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌ పర్యటనలోఉన్న అమిత్‌ షా జైట్లీ మరణ వార్త వినగానే హుటాహుటిన ఢిల్లీకి బయలు దేరారు. 

చదవండి: వకీలు నుంచి విత్తమంత్రిగా ఎదిగి..

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top