నేటి విశేషాలు..

Major Events On 16th June 2020 - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా 81.07 లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 4.38 లక్షల మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 41.87 లక్షల మంది

జాతీయం
భారత్‌లో పెరగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు
దేశంలో మొత్తం 3లక్షల 32వేల 424 పాజిటివ్‌ కేసులు
ఇప్పటివరకు 1,69,798 మంది డిశ్చార్జ్‌, 9,520 మంది మృతి
దేశంలో ప్రస్తుతం 1,53,106 యాక్టివ్‌ కేసులు

ఢిల్లీ: నేడు, రేపు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌
మధ్యాహ్నం 3 గంటలకు 21 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌
రేపు కేంద్ర పాలిత ప్రాంతాలు, 15 రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆరోసారి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నైరుతి రుతుపవనాల విస్తరణ
నేడు, రేపు రాష్ట్రానికి ఓ మోస్తరు వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్‌
తాడేపల్లి: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గవర్నర్‌ ప్రసంగం
గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలు
గవర్నర్‌ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం

నేడు అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం 

చిత్తూరు: శ్రీకాళహస్తి ఆలయంలో భక్తుల ప్రవేశానికి ఏర్పాట్లు 
నేడు శ్రీకాళహస్తి ఆలయంలో దర్శనానికి స్థానికులకు అనుమతి
రేపటి నుంచి శ్రీకాళహస్తి ఆలయంలో సామాన్యులకు అనుమతి

తెలంగాణ
ఉపాధిహామి పథకం, హరితహారం కార్యక్రమాల అమలుపై నేడు కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సదస్సు
హరితహారంపై దిశానిర్దేశం చేయనున్న సీఎం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top