మధ్యప్రదేశ్‌లో నడిరోడ్డుపై బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

In Madhya Pradesh Woman Gives Birth On Highway - Sakshi

భోపాల్‌: అధికారుల అలసత్వం మూలానా ఓ మహిళ నడి రోడ్డుపై బిడ్డకు జన్మనివ్వాల్సి వచ్చింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. బుర్హాన్‌పూర్‌ జిల్లాకు చెందిన కమలాభాయ్‌ ప్రసవవేదనతో విలవిల్లాడుతుంది. దాంతో ఆమె భర్త ప్రభుత్వం గర్భిణి మహిళల కోసం ప్రవేశపెట్టిన ‘జనని ఎక్స్‌ప్రెస్‌’ అంబులెన్స్‌కు కాల్‌ చేశాడు. కానీ అంబులెన్స్‌ సరైన సమయానికి రాలేదు. మరోవైపు కమలాభాయ్‌ నొప్పులతో బాధపడుతుంది. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కమలాభాయ్‌ భర్త తన బైక్‌ మీద ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ ఈ లోపే కమలాభాయ్‌ రోడ్డు మీదనే బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెను అక్కడి నుంచి షాపూర్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు.

వైద్యులు కమలాభాయ్‌, ఆమె కుమార్తెను ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై కమలాభాయ్‌ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్‌ సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top