బ్రిటన్ జాతీయుడికి శిరచ్ఛేదం

బ్రిటన్ జాతీయుడికి శిరచ్ఛేదం - Sakshi


వీడియో విడుదల చేసిన ఐఎస్ మిలిటెంట్లు 

ఖండించిన బ్రిటన్ ప్రధాని


 

 లండన్: ఇప్పటికే ఇద్దరు అమెరికన్ జర్నలిస్టులను తలనరికి చంపిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరో దారుణానికి పాల్పడ్డారు. సిరియూలో పట్టుకుని తమ నిర్బంధంలో ఉంచుకున్న బ్రిటన్ సహాయ కార్యకర్త డేవిడ్ హేన్స్(44)కు కూడా శిరచ్ఛేదం చేశారు. అమెరికా భాగస్వామ్య పక్షాలకు సందేశం పేరిట.. ఈ శిరచ్ఛేదనానికి సంబంధించిన దృశ్యాలతో రెండు నిమిషాల 27 సెకెండ్ల నిడివిగల ఓ వీడియోను విడుదల చేశారు. జీహాదీలపై యుద్ధానికి అమెరికా దళాలతో చేతులు కలిపిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌ను వారు తప్పుబట్టారు. తమ నిర్బంధంలో ఉన్న మరో బ్రిటన్ జాతీయుణ్ని హతమారుస్తామని కూడా ఆ వీడియోలో ఐఎస్ మిలటెంట్లు ెహ చ్చరించారు. శనివారం రాత్రి విడుదలైన ఆ వీడియోను బ్రిటన్ విదేశాంగశాఖ నిశితంగా పరిశీలిస్తోంది. కామెరాన్ క్లిప్పింగ్‌తో ప్రారంభమైన ఆ వీడియోలో.. కత్తి పట్టుకుని ముసుగు ధరించి ఉన్న ఓ వ్యక్తి ముందు ేహ న్స్‌లా కన్పిస్తున్న మరోవ్యక్తి మోకరిల్లి ఉన్నాడు. ‘నా మరణానికి పూర్తిగా డేవిడ్ కామెరాన్‌దే బాధ్యత.



పూర్వ ప్రధాని టోనీ బ్లెరుుర్ మాదిరే కామెరాన్ కూడా ఐఎస్‌కు వ్యతిరేకంగా అమెరికాతో చేతులు కలిపారు. పార్లమెంటు స్వార్థపూరిత నిర్ణయూలకు దురదృష్టవశాత్తూ బ్రిటన్ ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు..’ అని హేన్స్ చెప్పినట్టుగా అందులో ఉంది. హేన్స్ శిరచ్ఛేదాన్ని కామెరాన్ ఖండించారు. అది స్పష్టమైన ఓ దుష్టచర్యగా ఆదివారం ఆయన అభివర్ణించారు. హంతకులను వేటాడటంతో పాటు వారికి తగిన శిక్షపడేందుకు అన్ని చర్యలూ చేపడతానని ప్రతిన బూనారు. ఈ యూవత్ విషమ పరీక్షలో హేన్స్ అసాధారణ ధైర్య సాహసాలు, మనోనిగ్రహం ప్రదర్శించాడని, ఆయన కుటుంబానికి హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. హేన్స్ హత్యను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా తీవ్రంగా ఖండించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో అమెరికా తమ సన్నిహిత స్నేహితుడి వెన్నంటి ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top