నడిరోడ్డుపై కొట్టుకున్న ప్రేమజంట

Lovers Fight On Road In Karnataka - Sakshi

బెంగళూరు : నడి రోడ్డుపై ఓ ప్రేమ జంట గొడవకు దిగిన ఘటన కర్ణాటకలోని బొమ్మనహళ్లిలో చోటు చేసుకుంది. ప్రియుడు ప్రియురాలిపై దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో అవి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. పోలీసుల వివరాల మేరకు.. ఈ జంట బైక్‌పై వస్తూ ఓ చోట కిందకు దిగి వాగ్వాదానికి దిగారు. ఇదే క్రమంలో యువకుడు యువతిపై దాడికి యత్నించాడు. విషయాన్ని గుర్తించిన ఓ వ్యక్తి అడ్డుకునే యత్నం చేశారు. ఈ సమయంలో మరికొంత మంది అక్కడికి చేరుకుని దృశ్యాలను మొబైళ్లలో రికార్డు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరిని నిలదీశారు. ఇద్దరం ప్రేమించుకుంటున్నామని, ఇంటిలో గొడవ కారణంగా ఇలా జరిగిందని చెప్పడంతో ఇద్దరిని పోలీసులు హెచ్చరించి పంపించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top