మానసిక రోగికి పోలీసుల అంత్యక్రియలు

Karnataka Family Refuses Body Cop Digs Grave Buried Him - Sakshi

శవాన్ని తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యుల నిరాకరణ

బెంగళూరు: అందరూ ఉన్నా అనాథ శవంలా మిగిలిపోయిన ఓ మానసిక రోగికి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. స్వయంగా గొయ్యి తవ్వి మృతదేహాన్ని ఖననం చేసి మానవత్వం చాటుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాలు.. చామరాజనగర్‌ జిల్లా సరిహద్దు సమీపంలో 44 ఏళ్ల వ్యక్తిపై అడవి జంతువు దాడి చేసింది. ఈ క్రమంలో నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ అతడు ఇటీవలే మరణించాడు. ఈ విషయాన్ని పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు తెలియజేయగా.. కరోనా భయాల నేపథ్యంలో శవాన్ని తీసుకువెళ్లేందుకు వారు నిరాకరించారు. (‘కరోనా అన్ని వర్గాలను ఒక్కటిగా నిలిపింది’)

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏఎస్సై మడేగౌడ మరో ఇద్దరు పోలీసులతో కలిసి మృతుడి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. చామరాజనగర్‌లోని హిందూ శ్మశాన వాటికకు మృతదేహాన్ని తరలించగా.. అక్కడ ఎవరూ అందుబాటులో లేరు. దీంతో మడౌగౌడ స్వయంగా గొయ్యి తవ్వి.. ఓ తెలుపు వస్త్రంలో మృతదేహాన్ని చుట్టి పూడ్చారు. అనంతరం సమాధిపై పువ్వులు చల్లి.. అగరబత్తీలు వెలిగించారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ విషయం గురించి పోలీసు ఉ‍న్నతాధికారులు మాట్లాడుతూ.. మృతుడికి మతిస్థిమితం లేదని.. ఏఎస్‌ఐ అతడికి మూడు రోజుల క్రితం అంత్యక్రియలు నిర్వహించాడని తెలిపారు.(కాలి గాయం ఆమెను ఆప‌లేదు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top