నేవీలో తొలిసారి..

Indian Navy gets its first woman pilot, 3 women NAI officers - Sakshi - Sakshi

కన్నూర్‌(కేరళ): భారత నావికా దళంలో మొట్టమొదటి సారిగా మహిళా పైలెట్‌ ఎంపికయ్యారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుభాంగి స్వరూప్‌ ఈ ఘనత సాధించారు. అంతేకాదు, మరో ముగ్గురు మహిళా అధికారులను కూడా నావికాదళం ఎంపిక చేసింది. వీరు.. న్యూఢిల్లీకి చెందిన ఆస్తా సెహ్‌గల్‌, పుదుచ్చేరికి చెందిన రూప.ఎ, కేరళకు చెందిన ఎస్‌.శక్తిమాయ. నావికాదళంలోని నావల్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్టొరేట్‌ (NAI) విభాగంలో ఈ ముగ్గురూ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

కేరళలోని కన్నూర్‌ జిల్లాలో ఉన్న ఇండియన్‌ నావల్‌ ఎకాడెమీలో నావల్‌ ఓరియంటేషన్‌ పూర్తి చేసుకున్న ఈ నలుగురి మహిళలకు​ నావల్‌ చీఫ్‌ అడ్మిరల్‌ సునీల్‌ లన్బా పట్టాలు ప్రదానం చేశారు. తదుపరి విధులు చేపట్టబోయే ముందు ఈ నలుగురూ సంబంధిత విభాగాల్లో తర్ఫీదు పొందనున్నారు. ఉమన్‌ పైలెట్‌గా సుభాంగి స్వరూప్‌ హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడెమీలో శిక్షణ పొందుతారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top