హైడ్రాక్సీక్లోరోక్వీన్‌పై ఐసీఎంఆర్‌ కీలక సూచన

 ICMR Recommends HCQ Use Under Strict Medical Supervision - Sakshi

వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి

సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్‌-19 చికిత్సలో ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్వీన్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ పెద్దగా లేవని, అయితే ఈ మందును వైద్యుల పర్యవేక్షణలో వాడాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌ ) స్పష్టం చేసింది. కోవిడ్‌-19 చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ పనితీరుపై ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించిన మరుసటి రోజు ఐసీఎంఆర్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

భారత్‌లో నిర్వహించిన అథ్యయనాల్లో హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ వాడకంతో సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉన్నట్లు వెల్లడి కాలేదని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ పేర్కొన్నారు. ఈ మందును రోగులు విధిగా వైద్యుల పర్యవేక్షణలోనే వాడేందుకు తాము సిఫార్సు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రజారోగ్య సిబ్బంది కోవిడ్‌-19 నియంత్రణకు ముందుజాగ్రత్తగా ఈ ఔషధాన్ని వాడాలని సూచిస్తున్నామని, అయితే ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోరాదని, ఆహారం తీసుకున్న తర్వాతే వాడాలని చెప్పారు. కోవిడ్‌-19 చికిత్స కోసం ఈ మందును తీసుకునేవారు సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవని నిర్ధారించుకునేందుకు ఈసీజీ పరీక్ష చేయించుకోవాలని ఆయన పేర్కొన్నారు.

చదవండి : రెడ్‌జోన్లలో ఆటోలు, టాక్సీలకు అనుమతి!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top