భార్య వద్దు.. పెంపుడు కుక్కే ముద్దు

Husband Ready To Leave Wife Because Of His Pet Dog - Sakshi

పాట్నా: పెంపుడు కుక్కకోసం కట్టుకున్న భార్యను వదిలేయటానికి కూడా సిద్ధపడ్డాడు ఓ భర్త. ఈ వింత సంఘటన బీహార్‌ రాష్ట్రంలోని పాట్నాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాట్నాలోని గాంధీ మైదాన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటానికి ఓ మహిళ వచ్చింది. తన భర్త పెంపుడు కుక్కను వదిలిపెట్టమని అడిగినందుకు విచక్షణా రహితంగా కొట్టాడని పోలీసుల ఎదుట ఆమె వాపోయింది.

కుక్క కోసం తనకు విడాకులు ఇవ్వడానికి కూడా భర్త సిద్ధంగా ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఫిర్యాదు విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు. కొద్దిరోజుల తర్వాత పోలీసులు మహిళ ఫిర్యాదుతో ఆమె భర్తను కౌన్సిలింగ్‌కు పిలిచారు. ఈ విషయమై అతన్ని ప్రశ్నించగా.. ‘తను నన్ను వదిలేయాలనుకుంటే వదిలేయొచ్చు.. నాకేం సమస్యలేదు’ అన్న అతడి జవాబు విని ఆశ్చర్యపోవటం పోలీసుల వంతైంది. కాగా భర్త తనను తరుచూ ఇబ్బందులకు గురిచేసేవాడని, పలుమార్లు చేయికూడా చేసుకున్నాడని పోలీసులకు తెలిపింది. మార్కెట్‌ సైతం వెళ్లనివ్వడని ఆవేదన వ్యక్తం చేసింది. 

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top