బాంబు పేల్చిన హనీప్రీత్ మాజీ భర్త

Honeypreet would spend nights inside Ram Rahim's gufa, claims ex-husband Vishwas Gupta

సిర్సా: అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్‌ రాం రహీమ్‌ సింగ్‌పై హనీప్రీత్‌ మాజీ భర్త విశ్వాస్‌ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. డేరా బాబాకు హనీప్రీత్‌ దత్తపుత్రిక కాదని, చట్టబద్ధంగా దత్తత తీసుకోలేదని వెల్లడించారు. వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని ఆరోపించారు.

'తన డేరాలో గుర్మీత్‌ బిస్‌బాస్‌లా వ్యవహరించేవారు. ఆరు జంటలు(కుటుంబ సభ్యులు) 28 రోజుల పాటు డేరాలో ఉన్నాం. రాత్రిళ్లు హనీప్రీత్‌... గుర్మీత్‌ గదిలోనే ఉండేది. నన్ను మాత్రం గది బయట పడుకోమనేవార'ని గుప్తా తెలిపారు. గుర్మీత్‌తో ఏకాంతంగా గడుపుతుండగా హానీప్రీత్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నానని చెప్పారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని తనను బెదిరించారని వెల్లడించారు. తన భార్యతో గుర్మీత్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని 2011లో గుప్తా కోర్టుకు వెళ్లారు. ఆయుధాలతో కూడిన పెద్ద పెట్టెను గుర్మీత్‌ ఎల్లప్పుడు తన వెంట ఉంచుకునేవారని, అనుచరులు ఈ పెట్టెను అతడు ప్రయాణించే కారులో పెట్టేవారని గుప్తా వివరించారు.

కాగా, గుర్మీత్, హనీప్రీత్ ఎప్పుడూ కలిసే ఉండేవారని.. డేరాలో ఉన్నప్పుడే కాదు, బయటకు వెళ్లినప్పుడు కూడా ఒకే రూములో ఏకాంతంగా గడిపేవారని ఇంతకుముందు ఓ సాధ్వి చెప్పారు.  మరోవైపు హనీప్రీత్‌ కోసం హరియాణా పోలీసులు గాలిస్తున్నారు. ఆమె నేపాల్‌లో ఉన్నట్టు వచ్చిన వార్తలను అధికారులు తోసిపుచ్చారు. హనీప్రీత్‌ తమ దేశంలో లేదని నేపాల్‌ సీబీఐ కూడా స్పష్టం చేసింది.

Back to Top