తుపాన్‌ హెచ్చరిక: ముందే వరి కోతలు 

భువనేశ్వర్‌: ఒడిశా రాష్ట్రంలో రైతులు వరి కోత పనులు మొదలుపెట్టారు. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు రైతులు ముందస్తుగా వరి కోతలు చేపట్టారు. బంగాళాఖాతంలో నైరుతి దిశగా అల్పపీడనం ఏర్పడిన దృష్ట్యా వచ్చే రెండు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్ర ఉపరితలంపై 7.6 కిలోమీటర్ల మేర తుపాన్‌ ఏర్పడనుందని తెలిపింది.

ఈశాన్య దిశగా ఒడిశా తీరంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా తెలిపింది. సముద్రం భీకరంగా ఉంటుందని, జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వెంటనే వరి కోతలు ప్రారంభించి ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top