రాజధానిని ముంచెత్తిన వర్షాలు

Heavy rain in Delhi causes waterlogging in some areas - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెరుపులతో కూడిన భారీ వర్షం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాలు, తీన్‌మూర్తి భవన్‌, ఆర్‌కే పురం సహా పలు ప్రాంతాలను ముంచెత్తింది. కుండపోతతో దౌల కున్‌, పలాం మోద్‌ ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచిపోయింది.

మరోవైపు ఢిల్లీ సహా తెలంగాణ, ఉత్తరాఖండ్‌, హర్యానా, చండీగర్‌, ఢిల్లీ, యూపీ, తూర్పు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఈశాన్యరాష్ట్రాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top