సమాధానం చెప్పండి చూద్దాం?

Is Governor A Mere Puppet Question In BPSC Mains Exam In Bihar - Sakshi

బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన పరీక్షలో ప్రశ్న

పట్నా: బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన పరీక్షలో  ఓ వింత ఈ ప్రశ్న చూసి అభ్యర్థులు కంగుతిన్నారు. ‘భారతదేశంలో, మరీ ముఖ్యంగా బిహార్‌ రాష్ట్రంలో గవర్నర్‌ కీలుబొమ్మేనా..?’ అన్న ప్రశ్న అభ్యర్థులను ఆశ్చర్యానికి గురిచేసింది. బిహార్‌లో ఆదివారం బీపీఎస్సీ మెయిన్స్‌ పరీక్ష జరగ్గా సెకండ్‌ పేపర్‌లో ఈ ప్రశ్న అడిగారు. ఏం సమాధానం రాయాలో తెలీక విద్యార్థులు తల గోక్కున్నారు. ఈ ప్రశ్నపత్రం సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. దీనిపై అక్కడి ఆర్జేడీ (రాష్ట్రీయ జనతాదళ్‌) తీవ్రంగా స్పందించింది. గవర్నర్‌ పదవిని అపహాస్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్జేడీ ఎమ్మెల్యే భాయ్‌ వీరేంద్ర మాట్లాడుతూ.. ఆ ప్రశ్నను తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇవేకాకుండా మరిన్ని ప్రశ్నలు కూడా విమర్శలకు తావిచ్చాయి. ‘భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న రాజకీయ పార్టీలపై మీ అభిప్రాయం తెలపండి? అలాగే వాటివల్ల లాభనష్టాలను పేర్కొండంటూ మరో ప్రశ్న కనిపిస్తుంది. దీంతో పాటు ‘భారత్‌లో న్యాయస్థానాల క్రియాశీలత’ గురించి ప్రశ్నించారు. ఈ ప్రశ్నాపత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవటంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కృష్ణనందన్‌ ప్రసాద్‌వర్మ స్పందించారు. ప్రశ్నపత్రం రూపొందించడంలో తప్పిదం జరిగిందని వివరించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top