66కు పెరిగిన వరద మృతులు

Flood Situation Remains Grim In Patna - Sakshi

పట్నా : బిహార్‌ను కుదిపేస్తున్న వరదల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్ర రాజధాని పట్నా సహా పలు ప్రాంతాలు ఇంకా వరద నీటితోనే సతమతమవుతున్నాయి. వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య బుధవారం 66కు పెరిగిందని అధికారులు వెల్లడించారు. వరదలతో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం రూ 4 లక్షల పరిహారం ప్రకటించింది. పట్నాలో రోడ్లు, ఇళ్లను ముంచెత్తిన వరద నీటిని తోడిపోసేందుకు పెద్ద ఎత్తున పంప్‌ సెట్లను వాడుతున్నామని సీఎం నితీష్‌ కుమార్‌ వెల్లడించారు. వరద నీటిని పూర్తిగా తొలగించిన అనంతరం డ్రైనేజ్‌ వ్యవస్ధను మెరుగుపరిచే చర్యలు చేపడతామని చెప్పారు. రానున్న రోజుల్లో వరద పరిస్థితిని దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top