ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

Fire broke at factory of plastic bags in Delhi - Sakshi

ఢిల్లీ: పశ్చిమ ఢిల్లీలోని నన్‌గ్లోయిస్‌ నరేష్‌ పార్క్‌ ప్రాంతంలోని ఓ ప్లాస్టిక్‌ బ్యాగుల తయారీ కర్మాగారంలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూడు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన 25 ఫైరింజన్‌లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. మంటల కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top