క్రాఫోర్డ్‌ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

Fire Breaks Out At Mumbais Iconic Crawford Market - Sakshi

ఐకానిక్‌ మార్కెట్‌లో ఎగిసిపడిన మంటలు

ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని చారిత్రక క్రాఫోర్డ్‌ మార్కెట్‌లో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సాయంత్రం 6.15 గంటలకు మార్కెట్‌లో మంటలు చెలరేగాయి. మార్కెట్‌లోని నాలుగు షాపులకు మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు. ఘటనా ప్రాంతానికి హుటాహుటిన 10 అగ్నిమాపక యంత్రాలు చేరుకుని మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందిన మూడు నిమిషాల్లోనే ఘటనా ప్రాంతానికి అగ్నిమాపక యంత్రాలు చేరుకున్నాయని అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, అగ్నిప్రమాదానికి కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదని చెప్పారు. పూర్తి వివరాలు వెలుగుచూడాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.

చదవండి : ప్రముఖ టీవీ నటుడు కన్నుమూత

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top