డయాబెటిస్ అందుకే.. పెనుప్రమాదంలో భారత్

న్యూయార్క్ : గాలి కాలుష్యం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం అధికమని, ప్రపంచవ్యాప్తంగా మధుమేహ రోగుల సంఖ్య పెరగడానికి గాలి కలుషితం కావడమేనని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ మేరకు లాన్సెట్‌లో ఓ రిపోర్టును వెలువరించారు. మధుమేహం రావడానికి గల కారణాల్లో గాలి కాలుష్యం కూడా ఒకటని వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే భారత్ పెనుప్రమాదంలో ఉన్నట్లు అర్థం అవుతుంది.
కాలుష్య కోరల్లో చిక్కుకున్న న్యూఢిల్లీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌లో గాలి కాలుష్యాన్ని నివారించేందుకు ప్రత్యేక పాలసీలు కూడా ఏమీ లేవు. కలుషిత గాలి ఇన్సులిన్ ఉత్పత్తిపై ప్రభావం చూపి, రక్తంలోని గ్లూకోజ్‌ను శక్తిగా మారకుండా అడ్డుకుంటుంది. తక్కువ ఆదాయ దేశాల్లో ఎలాంటి ప్రత్యామ్నాయ పాలసీలు లేకపోవడం వల్ల అక్కడ పరిస్థితి దయనీయంగా ఉన్నట్లు రిపోర్టులో ఉంది.
ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(ఈపీఏ), ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)లు అతి తక్కువ కాలుష్యంగా గుర్తించిన ప్రదేశాల్లో కూడా డయాబెటిస్ విజృంభించిందని పరిశోధకులు రిపోర్టులో పేర్కొన్నారు. 2016లో గాలి కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల డయాబెటిస్ కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. గాలి కాలుష్యం వల్ల 42 లక్షల మంది చనిపోయారని ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి గోల్స్ రిపోర్టు-2018లో పేర్కొంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి