సాక్ష్యమున్నా.. కేసులేదు

Delhi Teen Hit A Old Man With His BMW Car - Sakshi

న్యూఢిల్లీ : మైనర్‌ల చేతికి వాహనాలు ఇవ్వద్దోని ఎంత మొత్తుకుంటున్నా జనాలు మాత్రం మారడం లేదు. వాళ్ల సరదా కోసం మితిమీరిన వేగంతో.. అవతలి వారి ప్రాణాలతో అడుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి దేశ రాజధానిలో చోటుచేసుకుంది. వివరాలు పూర్తిగా తెలియని ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఆధారం ఉన్నప్పటికి కూడా పోలీసులు ఎటువంటి చర్య తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం ఓ మైనర్‌ బాలుడి తన సరదా కోసం బీఎమ్‌డబ్య్లూ కార్‌ని ప్రమదాకరంగా నడపడంతో ఓ మధ్య వయసు వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం మోడల్‌ టౌన్‌ ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది.

సదరు మైనర్‌ బాలుడు తప్పుడు మార్గంలో అతి వేగంగా కార్‌ని డ్రైవ్‌ చూస్తూ వచ్చి నడి వయస్కున్ని గుద్దడంతో అతను తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. సదరు బాలుడు యాక్సిడెంట్‌ చేడమే కాక ఈ ప్రమాద సంఘటనను వీడియో తీసి తన తన స్నేహితుడికి కూడా పంపించడు. వీడియో చూసిన నిందితుడి స్నేహితుడు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. కానీ వారు ఈ విషయం గురించి స్పందించలేదు. అంతేకాక వీడియోలో సదరు మైనర్‌ బాలుడి గురించి కానీ, కార్‌ నంబర్‌ ప్లేట్‌ వంటి వివరాలు కూడా తెలియడం లేదు అంటూ తెలిపినట్లు సమచారం. ఇదిలా ఉంటే మైనర్‌ తండ్రికి కరోల్‌ బాఘ్‌ ప్రాంతంలో కార్ల షో రూం ఉన్నట్లు సమచారం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top