కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ ఎంపీ

Delhi MP Udit Raj joins Congress - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ టికెట్‌ నిరాకరించడంతో వాయువ్య ఢిల్లీ ఎంపీ ఉదిత్‌ రాజ్‌ కాషాయపార్టీని వీడి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ సమక్షంలో బుధవారం ఉదిత్‌ రాజ్‌ ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఉదిత్‌ రాజ్‌ను పక్కనపెట్టిన బీజేపీ వాయువ్య ఢిల్లీలో పంజాబీ సూఫీ సింగర్‌ హన్స్‌ రాజ్‌ హన్స్‌ను బరిలో దింపింది.

ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని సుప్రీం కోర్టు నీరుగార్చడాన్ని వ్యతిరేకించినందుకే బీజేపీ తనకు టికెట్‌ నిరాకరించిందని ఆయన వ్యాఖ్యానించారు. శబరిమల వివాదం, గత ఏడాది దళిత సంఘాలు ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపు వంటి పలు అంశాలపై గతంలో ఉదిత్‌ రాజ్‌ బీజేపీ వైఖరికి భిన్నంగా మాట్లాడారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top