బస్తర్‌-సుకుమా రహదారి పూర్తి

 danger in Maoist heartland - Sakshi

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పూర్తయిన రహదారి

బస్తర్‌-సుకుమా జిల్లాలకు కనెక్టివిటీ

లక్ష్యం డోర్నపల్‌-జగ్దాగొండ రహదారి

అదీ పూర్తయితే.. మావోలకు సమస్యలే!

సాక్షి, రాయ్‌పూర్‌ : చత్తీస్‌గఢ్‌లోని మావోయిస్ట్ ప్రభావి ప్రంతాల్లో రహదారి నిర్మాణం పూర్తయినట్లు.. రాష్ట్రప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ రహదారి నిర్మాణం వల్ల మావోయిస్టులకు కష్టాలు తప్పవని ప్రభుత్వం తెలిపింది. తాజాగా పూర్తయిన రహదారి పనులకు పహారా కాస్తున్న 12 మంది సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసులను ఈ ఏడాది మార్చిలో మావోయిస్టులు హత్య చేసిన విషయం తెలసిందే. ఈ రహదారి నిర్మాణం వల్ల మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన బస్తర్‌-సుకుమా జిల్లాలను అనుసాంధానం చేస్తుంది. ఈ రహదారి వల్ల ముఖ్యంగా బస్తర్‌ అటవీ ప్రాంతం నుంచి బయటి ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. తాజా పూర్తయిన ఇంజిరామ్‌-భేజీ రహదారిని మావోయిస్టులు ధ్వంసం చేససే అవకాశం ఉండడంతో.. 1000మంది పోలీసులతో వహారా ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మొదటి అంచెను విజయవంతంగా పూర్తి చేశామని డైరెక్టర్‌ జనరల్‌ (నక్సల్‌ ఆపరేషన్స్‌)  డీఎం స్వాతి తెలిపారు. ఈ రహదారి కోసం చాలామంది ప్రాణాలు కోల్పోయారు.. ఈ ఏడాది 13 మంది మృతి చెందారని ఆమె చెప్పారు. ఈ రమదారి నిర్మాణాన్ని పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (సీపీహెచ్‌సీఎల్‌) సవాలుగా తీసుకుని నిర్మించిందని స్వాతి తెలిపారు. రెండో అంచెలో మరో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన డోర్నపల్‌-జగ్దాగొండ రహదారిని పూర్తి చేస్తామని ఆమె అన్నారు. ఈ ప్రాంతంలోనే ఏప్రిల్ నెల్లో మావోయిస్టుల జరిపిన ఆకస్మిక దాడిలో 25 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించారని స్వాతి గుర్తు చేశారు. ఈరహదారి కూడా పూర్తయితే.. మావోయిస్టుల ప్రభావాన్నిబాగా తగ్గించవచ్చన్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top