నేత్రావతి నదిలో సిద్ధార్థ మృతదేహం లభ్యం

Coffee Day Founder Siddhartha Dead Body Found In Netravati River - Sakshi

సాక్షి, బెంగళూరు : కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్దార్థ మిస్సింగ్‌ కేసు విషాదాంతం అయింది. ఆయన మృతదేహం నేత్రావతి నదిలో లభ్యమైంది. ఆర్థికసమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సిద్ధార్థ సోమవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. బెంగళూరుకి 375 కిలోమీటర్ల దూరంలో మంగళూరుకి సమీపంలో ఉన్న నేత్రవతి బ్రిడ్జి వద్ద కారు దిగి ఫోన్‌ మాట్లాడుతూ అలా నడుచుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత కనిపించలేదు. ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందిన కారు డ్రైవర్‌.. ఆయన కోసం వెతికినా కనిపించలేదు. కుటుంబసభ్యులకు కారు డ్రైవర్‌ సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన కోసం తీవ్రంగా గాలించారు. చివరకు ఓ జాలరి ఇచ్చిన సమాచారంతో నేత్రానది వద్ద సిద్ధార్థ మృతదేహాన్ని కనుగొన్నారు. (చదవండి : కాఫీ కింగ్‌ అదృశ్యం)

(చదవండి : వ్యాపారవేత్తగా విఫలమయ్యా... )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top