వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే : ప్రకాష్ రాజ్

Coalition government will form in Center says Prakash Raj - Sakshi

ఢిల్లీ: కేంద్రంలో ఏర్పడబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని కాంగ్రెస్, బీజేపీకి మెజారిటీ రాదని సినీ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. మనది ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ అని, ఒక్క పార్టీకే మెజార్టీ ఇస్తే ఏం జరిగిందో అందరూ చూశారన్నారు. ప్రాంతీయ పార్టీలు, సంస్కృతులకు ప్రాధాన్యత ఉండాలని చెప్పారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నానని, విద్యా, వైద్య రంగంలో దేశానికి ఆదర్శప్రాయంగా ఆమ్ ఆద్మీ పార్టీ పని చేసిందని కొనియాడారు. పని చేసిన వ్యక్తులను చూసే ప్రజలు ఓటేయాలని సూచించారు.

కేసీఆర్ ఫెడరల్ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు సఫలమౌతాయని జోస్యం చెప్పారు. ఉగ్రవాద కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు బీజేపీ ఎలా టికెట్ ఇస్తుందని మండిపడ్డారు. ఇలాంటి వారు పార్లమెంట్ కెళ్ళి ఎలాంటి చట్టాలు చేస్తారని ఎద్దేవా చేశారు. బెంగళూరు సెంట్రల్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చానని, తనకు గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top