నమో సునామీతో 300 మార్క్‌..

BJP Wins with Bigger Mandate - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ హవాతో బీజేపీ రికార్డు స్ధాయిలో 301 స్ధానాల్లో గెలుపు దిశగా దూసుకుపోతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్‌ ఫిగర్‌ 272 స్ధానాలు అవసరం కాగా, బీజేపీ సొంతంగానే మేజిక్‌ మార్క్‌ను దాటింది. 2014లో ఆ పార్టీ సాధించిన 282 స్ధానాలను మించి అత్యధిక స్ధానాలు కమలం ఖాతాలో పడటం ఖాయమైంది.

ఇక ఎన్డీయే కూటమి 349 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. విపక్ష కాంగ్రెస్‌ కేవలం 50 స్ధానాలకు పరిమితమవనుండగా యూపీఏకు 91 స్ధానాలు దక్కనున్నాయి. ఇతరులు 103 స్ధానాల్లో ముందంజలో ఉన్నారు. కాగా తమకు అఖండ విజయం కట‍్టబెట్టిన ప్రజలకు ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విజయోత్సవ వేడుకల్లో పార్టీ చీఫ్‌ అమిత్‌ షాతో కలిసి మోదీ పాల్గొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top