బీజేపీ ఎంపీ అభ్యర్థుల ప్రకటన... మోదీ మరోసారి..

BJP MP Candidates First List Ahead Lok Sabha Polls 2019 - Sakshi

న్యూఢిల్లీ : మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ 182 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. ఈ మేరకు కేం‍ద్ర ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా గురువారం తమ ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి పోటీ చేయనుండగా.. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా గుజరాత్‌లోని గాంధీనగర్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు.

ఇక కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌ లక్నో(యూపీ) , నితిన్‌ గడ్కరీ నాగ్‌పూర్‌(మహారాష్ట్ర), స్మృతి ఇరానీ ఆమేథీ(యూపీ), కిరణ్‌ రిజిజు అరుణాచల్‌ ఈస్ట్‌ నుంచి లోక్‌సభ బరిలో నిలవనున్నారు. కాగా గాంధీనగర్‌ అభ్యర్థిగా అమిత్‌ షాను ప్రకటించడంతో.. ఆ నియోజకవర్గ సిట్టింగ్‌ ఎంపీ, కాషాయ దిగ్గజం ఎల్‌కే అద్వాణీ ఈ ఎన్నికల్లో పోటీ విషయంలో సందిగ్దత నెలకొంది.

 ప్రముఖ అభ్యర్థులు-  నియోజకవర్గం
 హేమమాలిని        -       మథుర(యూపీ)
స్వామి సాక్షి మహారాజ్‌ -  ఉన్నావ్‌(యూపీ)
వీకే సింగ్‌                -      ఘజియాబాద్‌(యూపీ)

హన్స్‌రాజ్‌ గంగారాం అహిర్‌ - చంద్రాపూర్‌(మహారాష్ట్ర)
పూనం మహాజన్‌ ముంబై నార్త్‌- సెంట్రల్‌(మహారాష్ట్ర)
ప్రీతమ్‌ గోపీనాథ్‌ ముండే - బీడ్‌(మహారాష్ట్ర)

ఉమేష్‌ జాదవ్‌ - గుల్బర్గా(ఎస్సీ- కర్ణాటక)
అనంతకుమార్‌ హెగ్డే - ఉత్తర కన్నడ(కర్ణాటక)
శోభా కర్లందాజే - ఉడుపి చిక్‌మంగళూరు(కర్ణాటక)

దుష్యంత్‌ సింగ్‌ - ఝల్వార్‌ బారన్‌(రాజస్తాన్‌)

సీపీ రాధకృష్ణన్‌- కోయంబత్తూరు(తమిళనాడు)
తమిళిసౌ సౌందరాజన్‌- తూతుక్కుడి(తమిళనాడు)

బండి సంజయ్‌ - కరీంనగర్‌(తెలంగాణ)
జి. కిషన్‌ రెడ్డి- సికింద్రాబాద్‌(తెలంగాణ)

డి. పురందేశ్వరి- విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్‌)
కన్నా లక్ష్మీ నారాయణ- నర్సారావు పేట(ఆంధ్రప్రదేశ్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top