భారత్‌లో అతి చౌకైన నగరంగా బెంగుళూరు

Bengaluru Cheapest City In India and Stands Five In World Expensive List - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో జీవించడానికి అతి చౌకైన మెట్రో నగరంగా బెంగుళూరు నిలిచింది. గ్లోబల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ రిపోర్టు గురువారం విడుదల చేసిన నివేదికలో జీవనానికి ప్రపంచంలో ఐదో చౌకైన నగరంగా ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా 139 మహా నగరాలపై గ్లోబల్‌ కాస్ట్‌ సర్వే నిర్వహించింది.

ఇందులో భారత్‌ నుంచి మూడు మెట్రో నగరాలు తొలి పది స్థానాల్లో నిలిచాయి. వరుసగా బెంగుళూరు మూడు, చెన్నై ఐదు, న్యూఢిల్లీ ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. భారత్‌లో జీవనానికి అత్యంత చౌకైన మెట్రోగా బెంగుళూరు తొలి స్థానంలో నిలిచింది.

కాగా, ప్రపంచంలో జీవనానికి అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్‌ ఎంపికైంది. అత్యంత ఖరీదైన నగరంగా ఎంపిక కావడం సింగపూర్‌కు ఇది వరుసగా ఐదోసారి. 139 మెట్రోల్లో దాదాపు 150 వస్తువులు, సర్వీసుల ధరలను పరిశీలించిన మీదట ఈ ర్యాంకులు ప్రకటించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top