సంబరాలు చేసుకునే సీన్‌ లేదు..

Arun Jaitley Says  No New Powers For Delhi Government On Supreme Court Verdict - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వ అధికారాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో ఆప్‌ శ్రేణులు సంబరాలు జరుపుకోవడం పట్ల కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ విస్మయం వ్యక్తం చేశారు. ఐఏఎస్‌ అధికారులు, దర్యాప్తు బృందాల నియామకం వంటి అంశాల్లో ఢిల్లీ సర్కార్‌కు అధికారాలు లేవని జైట్లీ సుప్రీం తీర్పునకు ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో తనదైన భాష్యం చెప్పారు. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతమని, పోలీస్‌, పబ్లిక్‌ ఆర్డర్‌, భూముల వంటి అంశాలపై కేంద్రానికే అజమాయిషీ ఉంటుందని , అధికారుల నియామకం, బదిలీలపై ఢిల్లీ ప్రభుత్వానికి అధికారం లేదని స్పష్టం చేశారు.

ఢిల్లీ రాష్ట్రం కానందున, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే అధికారాలన్నీ ఎన్నికైన కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వానికి ఉంటాయనే వాదన అర్థరహితమని జైట్లీ వ్యాఖ్యానించారు. పోలీస్‌, పబ్లిక్‌ ఆర్డర్‌, భూములకు సంబంధించిన అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వానికే ఉంటాయని సుప్రీం కోర్టు విస్పష్టంగా పేర్కొందని స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రభుత్వానికి పోలీస్‌ అధికారాలు లేనందున రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను విచారణ నిమిత్తం నియమించలేదని జైట్లీ చెప్పుకొచ్చారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top