మోదీపై అభ్యంతరకర పోస్ట్‌ : విద్యార్థి అరెస్ట్‌

AMU Student Arrested Over Modi Poster On Facebook - Sakshi

లక్నో : ప్రధాని నరేంద్ర మోదీపై ఫేస్‌బుక్‌ పేజ్‌లో అభ్యంతరకర పోస్టర్‌ను ప్రదర్శించిన అలీగఢ్‌ ముస్లిం వర్సిటీ (ఏఎంయూ) విద్యార్థిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో జరిగిన నిరసనలకు సంబంధించిన ఓ పోస్టర్‌ను ఎఫ్‌బీలో పోస్ట్‌ చేసిన ఏఎంయూ విద్యార్థి మహ్మద్‌ జైద్‌ రషీద్‌ (20)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రషీద్‌ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కొందరు ఏఎంయూ పూర్వ విద్యార్ధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్సిటీ అధికారులు, పోలీసులు ఈ ఉదంతంపై ఆరా తీయగా సదరు విద్యార్థి బిహార్‌లోని వర్సిటీ స్టడీ సెంటర్‌లో ఇటీవల అడ్మిషన్‌ తీసుకున్నట్టు వెల్లడైంది. అలీగఢ్‌ క్యాంపస్‌తో ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని ఏఎంయూ ప్రతినిధి షైఫీ కిద్వాయ్‌ స్పష్టం చేశారు. దర్యాప్తు పూర్తయిన వెంటనే దీనిపై తాము తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు. కాగా, నిందితుడిపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశామని సీనియర్‌ ఎస్పీ ఆకాష్‌ కుల్హరి తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top