క్యాంప్‌ నుంచి మెట్టినింటికి

Amid grief, a wedding in Kerala relief camp - Sakshi

తిరువనంతపురం: వరదలతో తీవ్ర విషాదంలో మునిగిన మలప్పురం జిల్లాలో ఓ యువతి పెళ్లి ఆమె కుటుంబ సభ్యులతోపాటు సహాయక శిబిరంలోని వారిలో ఆనందం నింపింది. అంజు అనే యువతికి షైజూ అనే వ్యక్తితో గతంలోనే పెళ్లి నిశ్చయమవ్వగా, వరదల వల్ల  వారంతా సహాయక శిబిరానికి రావాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో పెళ్లిని వాయిదా వేసుకోవాలని తొలుత భావించినా.. చివరకు అనుకున్న సమయానికే పెళ్లి జరిపించాలని వధూవరుల కుటుంబసభ్యులు నిర్ణయించారు. దీంతో ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా అంజు పెళ్లి దగ్గర్లోని ఓ గుడిలో జరిగింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top