కేజ్రీవాల్‌ను అడ్డుకున్న కాంగ్రెస్‌, ఎస్‌ఏడీ

Akali, Congress workers protest at Chandigarh airport as Arvind Kejriwal arrives - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఛండీగఢ్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద కాంగ్రెస్‌, శిరోమణి అకాలీదళ్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. కేజ్రీవాల్‌ రాకను వ్యతిరేకిస్తూ వారు నినాదాలు చేశారు. డ్రగ్స్‌ అంశాన్ని లేవనెత్తి పంజాబ్‌ ప్రతిష్టను ఆప్‌ మంటగలిపిందని కాంగ్రెస్‌, ఎస్‌ఏడీ కార్యకర్తలు ఆరోపించారు. ఇప్పుడు సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరా వంటి ఆప్‌ నేతలే డ్రగ్‌ స్మగ్లింగ్‌లో కూరుకుపోయారని విమర్శించారు. సుఖ్‌పాల్‌ సింగ్‌ను తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు.

కాగా, జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌)లో కాలుష్య సమస్య తీవ్ర రూపు దాల్చడంతో  పొరుగు రాష్ర్టాలతో సంప్రదింపులు జరుపుతున్న కేజ్రీవాల్‌ హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ కట్టర్‌ను కలిసేందుకు బుధవారం ఛండీగఢ్‌ చేరుకున్నారు. కేజ్రీవాల్‌ వెంట ఢిల్లీ పర్యావరణ మంత్రి, కార్యదర్శిలు కూడా ఉన్నారు. దేశ రాజధాని సహా  ఎన్‌సీఆర్‌ అంతటా కాలుష్య తీవ్రతతో కొట్టుమిట్టాడుతుండటంతో ఆయా ప్రాంతాల్లో హెల్త్‌ ఎమర్జెన్సీ ప‍్రకటించిన విషయం విదితమే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top