‘సర్కార్‌పై విశ్వాసం సడలలేదు’

85% of indians  - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: భారత ప్రభుత్వంపై దాదాపు 85 శాతం మంది భారతీయులు విశ్వాసం కనబరుస్తున్నారని పీఈడబ్ల్యూ రీసెర్చి సెంటర్‌ నిర్వహించిన ఓ అథ్యయనం వెల్లడించింది. పాలన, ప్రభుత్వంపై విశ్వాసం ప్రాతిపదికన చేపట్టిన ఈ సర్వేలో ఐదింట నాలుగొంతుల పైగా భారతీయులు కేంద్ర ప్రభుత్వంపై సంతృప్తి, విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఆశ్చర్యకరంగా సైనిక పాలన దేశానికి మంచిదని 53 శాతం ప్రజలు అభిప్రాయపడటం గమనార్హం.ఇక 27 శాతం మంది ధృడమైన నాయకుడు అవసరమని ఆకాంక్షించారు.కాగా, రష్యాలో దాదాపు సగం మంది రష్యన్లు(48 శాతం) స్ఫూర్తివంతమైన నాయకత్వంతో కూడిన ప్రభుత్వాన్ని కోరుకున్నారని అథ్యయన నివేదిక స్పష్టం చేసింది.

గట్టి నాయకుడు ఉంటే పార్లమెంట్‌, న్యాయస్ధానాల జోక్యం లేకుండా నిర్ణయాలు తీసుకోగలుగుతారని ప్రపంచవ్యాప్తంగా 26 శాతం మంది అభిప్రాయపడ్డారని పేర్కొంది. సాంకేతిక దిగ్గజాలతో కూడిన ప్రభుత్వాలే మెరుగైన సేవలు అందిస్తాయని భారత్‌ సహా పలు దేశాల ప్రజలు ఈ సర్వేలో చాటారని తెలిపింది. సైనిక పాలనను భారత్‌, దక్షిణాఫ్రికాలో సగానికి పైగా ప్రజలు సమర్థించగా, ఈ దేశాల్లో 50 ఏళ్లు దాటిన వారు మాత్రం ప్రజాస్వామిక ప్రభుత్వాలే దేశానికి ఆయువుపట్టని స్పష్టం చేశారని నివేదిక తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top