అక్కను వేధిస్తున్నాడని...

10th class student slicts sister lover - Sakshi

సాక్షి, పాట్నా : అక్కను ప్రేమించమంటూ వేధిస్తున్న ఒక యువకుడి గొంతుకోసి పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు పదో తరగతి చదువుతున్న విద్యార్థి. ఈ ఘటన బీహార్‌లోని కైమూర్‌ జిల్లాలోని బభూ పట్టణంలో గురువారం రాత్రి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చెబుతున్న వివరాలివి.

బభూ పట్టణానికి చెందిన సోను నోనియాన్‌ (22) కొంతకాలంగా ఒక యువతిని  ప్రేమించమంటూ వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని పదో తరగతి చదువుతున్న ఆమె సోదరుడు ఒకటిరెండుసార్లు గమనిం‍చాడు. మా అక్క వెంటపడొద్దు.. మాది సంప్రదాయ కుటుంబం అని ఒకటిరెండుసార్లు నోనియాన్‌కు అతను చెప్పాడు. అయినా నోనియాన్‌ అతని మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు.   

ఇదిలావుండగా.. బుధవారం మరోసారి ప్రేమించమంటూ నోనియాన్‌ ఆమెను వెంబడించాడు. ఈ విషయాన్ని గ్రామస్థులు ఆమె సోదరుడికి చెప్పారు. దీంతో ఆగ్రహించిన అతను.. నోనియాన్‌తో ఘర్షణ పడ్డారు. పెద్దలు అక్కడకు రావడంతో.. ఇద్దరూ పక్కకు వెళ్లిపోయారు. గురువారం సాయంత్రం స్నేహితులతో కలిసి నోనియాన్‌ పొలాల్లో పేకాట అడుతున్నాడని తెలుసుకున్న బాధితురాలి తమ్ముడు అక్కడకు వెళ్లాడు. అదును చూసి నోనియాన్‌ మీద పడి.. అతని గొంతుగోసి హత్య చేశాడు. ఇదే విషయాన్ని హంతుకుడు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన అంగీకరించాడని కైమూర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ హర్‌ప్రీత్‌ కౌర్‌ చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top