ఫ్లోరోసిస్‌ బాధితులను ఆదుకుంటాం

we will help to Fluorosis victims : police - Sakshi

మర్రిగూడ (మునుగోడు) : జిల్లాలోని ఫ్లోరోసిస్‌ బాధితులకు పోలీస్‌ శాఖ జనమైత్రి కార్యక్రమం ద్వారా ఆదుకుంటుందని జిల్లా ఎస్పీ  శ్రీనివాస్‌రావు అన్నారు. గురువారం మండలంలోని శివన్నగూడ రిజర్వాయర్‌ను పరిశీలించారు. గతంలో ఈ రిజర్వాయర్‌ వద్ద ముంపు బాధితులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణపై పలు వివరాలను సేకరించారు. అనంతరం మండలంలోని ఖుదాభ„Š పల్లి గ్రామానికి చెందిన ఫ్లోరోసిస్‌ బాధితురాలు బొమ్మగాని సింధును ఆయన పరామర్శించారు. ఈమెకు రెండు కాళ్లు పనిచేయకపోవడంతో నడవలేక పోతుంది. ఈమెకు వైద్య ఖర్చు రూ.ఏడు లక్షలను తమ శాఖ నుంచి అందిస్తామని హామీ ఇచ్చారు. నాంపల్లి సీఐ బాలగంగిరెడ్డి, ఎస్‌ఐలు కొండల్‌రెడ్డి, నాగభూషణ్‌రావు, ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్‌ కంచుకట్ల సుభాష్, సదుర్గ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top